Fri. Aug 7th, 2026

గిరిజన గ్రామాల అభివృద్ధి,మౌలిక వసతుల ఏర్పాటులో ఆది కర్మ యోగి అభియాన్ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమనీ పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి అన్నారు.ఎన్నికైన ఏడు గ్రామాల అభివృద్ధి కోసం టీం వర్క్ ద్వారా పనిచేసి, విజన్–2030 వరకు సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరేలా ప్రణాళిక చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న,ఏపీఓ రంగా,ఏపిఎం మీరాభి,టీం లీడర్ హెచ్.ఎం.ప్రకాష్ రావు,ఐసిడిఎస్ మాధవిలత,హెచ్‌డబ్ల్యూ.ఓ పవన్ కుమార్,సి.సి.శ్రీను, హెల్త్ సూపర్వైజర్ సడల దేవి, హెచ్‌ఎంలు భద్రు,విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Share this post...