J365 NEWS. మణుగూరు మండలంలో సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినవి. సేవాలాల్ సేన ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా సేవాలాల్ సేన మణుగూరు మండల కమిటీ, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షవర్యులు హుస్సేన్ నాయక్ ఆలోచన మేరకు సేవాలాల్ సేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మణుగూరు మండల బంజారా ప్రజానీకం, ప్రతి తండాలో ఉన్న నాయక్ ,కార్బరీలు, వివిధ పార్టీలో ఉన్నటువంటి బంజారా నాయకులు, బంజారా సంఘం నాయకులు, పెద్దలు పూజలు ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగస్తులు అందరూ పాల్గొని జెండా ఆవిష్కరణ, భారీ శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా సేవాలాల్ సేన అశ్వాపురం మండల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ భూక్యా నరసింహ నాయక్ పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో, బంజారా సమాజం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నదని, బంజారా సమాజానికి ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి, కొంతమంది అగ్రవర్ణాల నాయకులు, వివిధ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, ఆదివాసి సోదర సోదరీమణులకు ఉసుగొల్పి ఎస్టీ జాబితా నుండి లంబాడి ప్రజలకు తీసివేయాలని చేస్తున్న ప్రయత్నం సరైనది కాదని, దీనిపై వెంటనే బంజారా సమాజం తిరగబడి, ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకతి ,విముక్తి కోసం పోరాడిన చరిత్రగా అంశం బంజారా ప్రజలది అని, బంజారా సమాజానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినై కావున మనమందరం ఒకే తాటిపై సమిష్టిగా ఉండి పోరాటం చేయవలసిన అవసరం ఉందని ప్రసంగించారు. తదానంతరం సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు అజ్మీర నిర్మల భాయ్, మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సేవాలాల్ సేన అందరికీ న్యాయంగా, ధర్మంగా, జవాబు దారితనంగా పనిచేస్తుంది కావున ప్రస్తుత సమాజానికి సేవాలాల్ సేన యొక్క ఆవశ్యకత ఉన్నదని అందరూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో పనిచేసే బంజారా సమాజానికి, అభివృద్ధి బాటలో పయనించే విధంగా పనిచేయాలని ప్రసంగించడం జరిగినది. సేవాలాల్ సేన మణుగూరు మండల అధ్యక్షులు గుగులోత్ రవికుమార్ నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అయినటువంటి బంజారా సమాజానికి, బంజారా ప్రజలకు సేవాలాల్ సేన దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ప్రజలందరూ మమేకమై పనిచేయాలని కోరారు. సేవాలాల్ సేన మహిళా మండల అధ్యక్షులు ఇస్లావత్ ద్వాలి ప్రసంగిస్తూ బంజారా సమాజం పై మరియు యావత్ భారత దేశ చరిత్రలో బంజారా సమాజం బంజారా మహిళా వేషధారణ కీలకమైనటువంటి పరిణామం అని బంజారా మహిళలు ఏకతాటిపై ఉండి బంజారా సమాజాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని మాట్లాడినారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా అనేకమంది ప్రభుత్వ ప్రైవేటు, ఉద్యోగస్తులు, ప్రతి తండా నాయక్ , కార్బరీలు, అశ్వాపురం మండల కమిటీ ఉపాధ్యక్షులు ఇస్లావత్ రాజు నాయక్ అశ్వాపురం మండలం కమిటీ సలహాదారు సక్రు నాయక్ , కార్యదర్శి తేజావత్ సోమల నాయక్ , మణుగూరు మండల కమిటీ మహిళా సభ్యులు కవిత , పినపాక నియోజకవర్గం సమన్వయకర్త ఇస్లావత్ కోటియా నాయక్ తదితరులు పాల్గొని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని, శాంతియుతమైన ర్యాలీని జయప్రదం చేయడం జరిగినది.


