పాల్వంచ మండల స్థాయి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంఇఓ శ్రీరామ్ మూర్తి శాలవ కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ నేపథ్యంలో ఎంపీపీఎస్ నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి మరియు ఎంఇఓ శ్రీరామ్ మూర్తి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం,వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,పాఠశాల సిబ్బంది ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
