భద్రాద్రి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షుడు బట్టు హుస్సేన్ నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు పాపావత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివనాయక్ మాట్లాడుతూ… బంజారా, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దశలవారీగా ఉద్యమాలకు సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు.రాబోయే 25వ తేదీన జిల్లా,మండల కమిటీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.ఆ రోజున భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు.ఈ సమావేశంలో పాపావత్ రాందాస్ నాయక్, బట్టు హుస్సేన్ నాయక్,మంగ నాయక్, రమేష్ నాయక్,బాలు నాయక్, హరి నాయక్, సేవియా నాయక్, ప్రసాద్ నాయక్,రాంబాబు నాయక్,బాబు నాయక్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
