
ఐక్య తల్లిదండ్రుల సంఘం సభ్యత్వ నమోదు మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు హెచ్ఎం యన్ చందు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి కరపత్రాలు అందజేసిన ఎటిఈసి (అలియాన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్) భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్ మాళోత్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభాగ్యులకు అన్నార్థులకు యాచకులకు పట్టెడన్నం కార్యక్రమం,కాలుష్య నియంత్రణకై బ్యాగుల పంపిణీ,రక్తదానం,మొక్కలు నాటడం వంటి పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బి.శంకర్,ఎస్.బాలు,పి.వెంకటేశ్వర్లు,ఐ.కోటేశ్వరరావు,కృష్ణ రామ్ ధన్,సుక్య,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
