Tue. Feb 3rd, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కూనవరం పాఠశాలలో డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ అద్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తీరక పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు,ఆటలు,నాటకాలతో వేడుకను సృజనాత్మకంగా నిర్వహించారు.డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతి పూలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే సారయ్య, రుక్మిణి,సరిత,రేగా,జయలక్ష్మి, రఘు మోహన్ రావు,అనిత మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండగను ఉల్లాసభరితంగా జరుపుకున్నారు.

Share this post...