J365NEWS, చోడవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న గోవాడ చక్కెర కర్మాగారంను ఆర్ధిక ఇక్కట్లు నుండి గట్టెక్కించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెరకు సాగు గిట్టుబాటు అయ్యేవిధంగా వ్యవసాయ విధానాలను రూపొందించి, ఈ కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకురావాలని జనసేన చోడవరం నియోజవర్గం జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు కోరారు. చెరకు బకాయిలను సత్వరమే చెల్లించి వేలాది రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ విషయాన్ని శాసన సభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి చోడవరం రైతులు, ప్రజలు, కర్మాగారం కార్మికులు, చోడవరం జనసేన పార్టీ శ్రేణులు తరపున చోడవరం నియోజవర్గం జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు ధన్యవాదాలు తెలిపారు.

