Wed. May 6th, 2026

J365NEWS:   రుమటాయిడ్ అర్థరైటిస్, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, మాజీ డిఎస్పి నళిని జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను, ఆమె యొక్క అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం గురించి వాకబ్ చేయగా, తాను ఏన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నానని తెలిపారు. ప్రభుత్వము సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళిని కి వివరించిన కలెక్టర్. అల్లోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉందని కలెక్టర్ కు తెలిపారు. ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని, ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సర్వీస్ ఇష్యులు ఏమి ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళిని కి తెలియజేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు.

Share this post...