Fri. Jan 30th, 2026

J365 NEWS :  శరత్ మాక్స్ విజన్ కంటి స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం వారి సారథ్యంలో డాక్టర్ దేవేందర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ  సహకారంతో రేగళ్ల పెద్దతండా గ్రామ పంచాయతీ ఆశ్రమ పాఠశాల యందు ఈరోజు ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా గిరిజన మారుమూల ప్రాంతమైనటు వంటి నా సొంత గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని, ఈ శిబిరంలో 160 మంది పాల్గొని కంటి వైద్య పరీక్ష చేయించుకోవడం, అదృష్టాన్ని మనమందరం పాలుపచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, పరీక్ష నిర్వహించిన అనంతరం 6గుర నిరుపేద వారిని ఉచితంగా కంటి ఆపరేషన్ కొరకు దగ్గరుండి ఖమ్మం శరత్ మాక్స్ విజన్ కంటి వైద్యశాలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించి దగ్గరుండి వ్యాను ఎక్కించడం సంతోషకరమైన విషయమని వారు కొనియాడారు. ఇటువంటి సదుపాయం కల్పించిన ఆసుపత్రి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ మేము మీ మారుమూల ప్రాంతానికి వచ్చి మీరు సేవ చేయడం ఈ భాగ్యం కల్పించిన మీ నాయకుడు పూర్ణ కి ప్రత్యేకమైన అభినందనలు అని పూర్ణ  మీకు నాయకుడు కాదు ఒక సేవకుడని డాక్టర్ కొనియాడారు. ఇటువంటి సేవా దృక్పథం కలిగిన పెద్దలు ఉండడం చాలా సంతోషకరమైన విషయమని పూర్ణ గారి పిలుపుమేరకు మీరందరూ మీ సేవలో మేము పాలుపంచుకోవడంమా టీమ్ అంతా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ నూనావత్ శ్రీను, లావుడ్య రామకృష్ణ, గూగులోత్ పులియ నాయక్, పంచాయతీ సెక్రెటరీ ఇస్మాయిల్ ,యూత్ నాయకులు బానోత్ అనిల్,లకవత్ సుమన్, నూనావత్ దేవేందర్, నూనావత్ జోగేందర్, ధారవత్ గణేష్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this post...