Sat. Jan 31st, 2026

–లంబాడీల మూల వాసులు,పాలకులది కుట్రదారులది విభజించు, పాలించు విధానం,ఆదివాసీ, గిరిజనులు అంతా ఒక్కటే,

—కుట్రలకు వ్యతిరేకంగా లంబాడిల ఆత్మగౌరవ సభలో ఐక్యత చాటిన లంబాడీలు.

–మానుకోట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన లంబాడి ఆత్మగౌరవ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన లంబాడి ఆత్మగౌరవ సభ జేఏసీ నాయకులు.

 

J365 NEWS: లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన లంబాడీ ఆత్మగౌరవ సభ కి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ సభకి అధ్యక్షత డాక్టర్ జగదీష్ వహించారు., ఈ సభకి లంబాడి వేషధారణలతో పాటు గిరిజన నృత్యంతో అల్లరించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య నాయకులు, లంబాడి ఆత్మగౌరవ సభ లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో  కొయ్య, గోండ్, లంబాడీ సోదరులను చీల్చి విభజించి పాలించు అనే ధోరణిలో కుట్రలు చేస్తున్నరని మండిపడ్డారు. ఈ సందర్భంగా భూక్యా సంజీవ్ నాయక్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్,, దాసరం నాయక్ మాట్లాడుతూ లంబాడీలు ఈరోజు ఎస్టీలుగా గుర్తింపబడలేదు, లంబాడీలు అనేది నీజాం రజాకారుల పాలన నుండి, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన జాతి, స్వతంత్రం ముందే లంబాడీలకు ఎస్స్టిలుగా గుర్తింపు. మా జాతి ఆత్మగౌరవాన్ని, మా మనోభావాలను దెబ్బతీసెలా మాట్లాడితే ఏవరి సహించేది లేదు. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో పొడవుగా భారీ ఆకారంలో ఉండే శరీరాన్ని చూసి లంబాడి అని బిరుదు ఇచ్చారు. ఆ లంబాడీలే ఈరోజు దేశ విభజనలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, స్వతంత్ర పోరాటంలో పాల్గొని పాలకుల మెప్పు పొందారు. కానీ ఈరోజు ఆదివాసి సహోదరులకు వెనుక నుంచి నడిపించే దుష్టశక్తుల మాటలు విని అన్నదమ్ముల మధ్య వైరం కూడా చూడకుండా, వారి సోలాభం కోసం మమ్ముల్ని ఆగం చేస్తున్నారు అని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడానికి ఐదు కోట్ల ఖర్చు అవుతుంది ఆ డబ్బులు వెనుక నుంచి ఎవరు పంపిస్తున్నారో మాకు తెలుసు. కానీ మేము వారి తాటాకు చప్పట్లకు భయపడే వాళ్ళం కాదు.

డాక్టర్ వివేక్ డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత మాలోత్, ఎమ్మెల్యే లు బానోత్ శంకర్ నాయక్, రాందాస్ నాయక్ లు మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసివేయడం సమస్య కాదు. అన్ని జాతులకు సమానం అవకాశాలు కల్పించాలి. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలి. లంబాడీల ఆత్మగౌరవ సభకు‌ సంపూర్ణ మద్దతు. రిజర్వేషన్లు ఓ ఒక్కరి సొత్తూ కాదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ కలలుగన్న సమాజం అందిరికీ విద్యా,వైద్యం, ఉపాధి సమపాళ్ళలో అందాలి. జాతుల మధ్య వివాదాలు ఉండకూడదు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి అని అన్నారు.మానుకోట లంబాడీల ఆత్మగౌరవ సభలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, లంబాడిల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్, లంబాడి ఆత్మగౌరవ సభ జేఏసీ కన్వీనర్ బానోత్ జగదీశ్వర్, మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, రాందాస్ నాయక్, డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్, సామాజిక ఐక్య చైతన్య వేదిక గుగులోత్ కిషన్ నాయక్, అంగోత్ బిందు, మాలోత్ శ్రీను నాయక్ లంబాడి ఆత్మగౌరవ సభ జేఏసీ నాయకులు దాస్రం, టీఎస్ టీటీఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ ఈరు నాయక్, డిఎస్ఎఫ్ఐ డాక్టర్ వివేక్, బానోత్ కిషన్ నాయక్, రామ్ చందర్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు గుగులోత్ రవి నాయక్, శంకర్ నాయక్, బాదావత్ శంకర్, ఇస్లావతు లచ్చిరాం, భూక్యా రాంజీ, నెహ్రు నాయక్, నెహ్రు రాథోడ్, టిడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్, మహేందర్, శ్రీనివాస్, మోహన్ నాయక్, బానోత్ రమ్మన్నా, గుగులోత్ శ్రీరామ్, గాంధీ నాయక్, రమేష్ రాథోడ్, సేవాలాల్ సేన నాయకులు మోతిలాల్, నందులాల్, స్రవంతి, పద్మ, సురేష్, గోర్ సేన హాట్య నాయక్, హరిలాల్, సురేష్ నాయక్, చౌహన్, హరి నాయక్, బయ్యారం మురళి నాయక్, అంగోత్ చందులాల్, అన్ని సంఘాల నాయకులు, బంజారా బిడ్డలు పాల్గొన్నారు.

 

Share this post...