Sat. Jun 20th, 2026

J365NEWS:  కొత్తగూడెం జిల్లా నుంచి మానుకోటలో జరిగిన లంబాడీల ఆత్మగౌరవ సభకు భద్రాద్రి జిల్లా గిరిజన సంఘాల ప్రధాన నాయకులు LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్,జుంకీలాల్,లాల్ నాయక్, మోహన్,మంగీలాల్, గాంధీ నాయక్ తరలి వెళ్లారు.ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ మాట్లాడుతూ..లంబాడీల పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా లంబాడీ సంఘాలు ఐక్యంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

Share this post...