కొత్తగూడెం మున్సిపల్ సంస్థ పరిధిలోని పాత 23వ వార్డు, 55వ విభాగం కూలీ లైన్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.వాడవాడలా వీధి వీధిగా మహిళా సోదరీమణులు,కుటుంబ సభ్యులు,బంధువులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ సభ్యుడు,దక్షిణ మధ్య రైల్వే మండలి డి.ఆర్.యు.సి.సి. సభ్యులు వై.శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కొత్తగూడెం మున్సిపల్ సంస్థ ప్రజలందరికీ,వార్డు ప్రజలకు, మహిళా సోదరీమణులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
