Sat. Jan 31st, 2026

పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సందేశమిస్తూ సింగరేణియన్ ప్రకృతి హరిత దీక్షుడు మాటూరి మహావిష్ణు మూర్తి పుట్టిన రోజు సందర్భంగా మంగళ వారం స్థానిక వన దుర్గామాత ఆలయ ప్రాంగణంలో చిరంజీవి ఎం.డి. మహేర్ మామిడి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.భద్రాద్రి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రకృతి హరిత దీక్ష, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎన్. రాజశేఖర్ సూచనల మేరకు చిన్నారులు మొక్కలు నాటాలని సంకల్పించారు.అనంతరం మహా మూర్తి మిత్రబృందం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా జాతీయ పర్యావరణ పరిరక్షణ అవార్డు గ్రహీత బాలు నాయక్‌తో పాటు సంపత్, కుమార్,ఎం.రవి,టి.బాలాజీ,కిరణ్,శివ,రహీం,మహబూబ్, సంజయ్,నాగేంద్రబాబు,సుధీర్,మోహన్,అశోక్,పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this post...