
రక్తదాతలను ప్రోత్సహించడం లక్ష్యంగా,ఆపదలో ఉన్నవారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే బి.వినోద్ కుమార్.ఈ మేరకు జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు.కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ, అవసరమైనప్పుడు స్వయంగా రక్తదానం చేయడమే కాకుండా మరెందరిని రక్తదానం చేయడానికి ప్రోత్సహిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది.ఈ సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జెబి బాలు,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ వినోద్ కుమార్ ను అభినందించారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ర్,సీనియర్ సభ్యులు కోనేరు పూర్ణచంద్రరావు, మోహన్ రావు,మోహన్ రావు, కూర శ్రీధర్,ఎంవీ చౌదరి, కోనేరు నాగేశ్వరరావు,జయ కుమార్,నరసింహారావు,కమలాకర్, రాజేష్,జుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
