Sat. Jan 31st, 2026

–అనంతారం ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు గుగులోత్ కిషన్ నాయక్.

–కిషన్ నాయక్ మాట్లాడుతూ విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందుతారని అన్నారు..

J365NEWS: మహబూబాబాద్ పట్టణ శివారు అనంతారం ప్రాథమిక పాఠశాలలో 2004 ,2005 సంవత్సరంలో 5వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి .అనిత అధ్యక్షతన పూర్వ విద్యార్థిని కాడెం సింధు సారధ్యంలో ఈ కార్యక్రమం నాడు పనిచేసిన ఉపాధ్యాయులతో కార్యక్రమం ఘనంగా నిర్వహించి 2005లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు గుగులోతు కిషన్ నాయక్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారు హెచ్ఎం గా నాడు విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామ అభివృద్ధికి అనేక సామాజిక కార్యక్రమాలు పేద విద్యార్థులకు సహాయ సహకారాలు పాఠశాల అభివృద్ధికి అనేక సేవలు అందించిన వారికి మరియు ప్రస్తుతం ఉన్న హెచ్.ఎం జి .అనిత, రత్న కుమారి ని ఘనంగా సత్కరించడం జరిగింది .అనంతరం ముఖ్యఅతిథిగా వచ్చిన గుగులోత్ కిషన్ నాయక్  మాట్లాడుతూ గతంలో ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు గురువులను గుర్తుంచుకొని ఘనంగా సత్కరించడం అభినందనీయం అని అన్నారాయన.

ఈ సమాజానికి దిక్సూచి అని ఇది ఐక్యత ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చిన్నతనంలో 5వ తరగతిలో చదువు చెప్పిన గురువులను గుర్తించి ఈరోజు అందరూ పిల్లలు కలిసి ఘనంగా సత్కరించడం అభినందనీయం అనై అన్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సింధుజ ,కృష్ణవేణి ,యమునా ,కళ్యాణి ,సౌజన్య ,స్వప్న ,నాగమణి ,యమునా ,హేమలత ,రజిత ,రాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ అనుష సురేష్ రమ్యశ్రీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆటపాటలతో విందు భోజనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు గురువులను సత్కరించి ఘనంగా నిర్వహించారు.

Share this post...