Wed. Aug 5th, 2026

లక్ష్మీదేవిపల్లి మండలం, కొయగట్టు గ్రామం‌ అదనపు కలెక్టర్ సౌరబ్‌ శర్మ ఆదేశాల మేరకు,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొయగట్టులో నూతన భవనాల కోసం స్థల సేకరణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూనావత్‌ భిక్షం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామస్థుల సహకారంతో దాదాపు ఇరవై కుంటల స్థలాన్ని సేకరించడం జరిగింది.ఈ స్థలంలో పాఠశాల నూతన భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే మంజూరు చేసిన రెండు మరుగుదొడ్ల నిర్మాణాన్ని కూడా రాబోయే రోజుల్లో ఇదే ప్రదేశంలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.గ్రామంలో విద్యా వాతావరణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Share this post...