Sat. Jan 31st, 2026

ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు హిందీ పండిట్స్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి ఆర్ టి యు జిల్లా సన్న హక సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో పండిట్స్ అప్డేడేషన్ నెలలు గడిచింది..కానీ గిరిజన సంక్షేమ శాఖలో పండిట్స్ పిఈటి లను అప్గ్రేడ్ చేయకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర పి ఆర్ టి యు అధ్యక్షులు కార్యదర్శి విన్నవించగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జి.నరేష్,హరికిషన్,నాగేశ్వరావు,తారాచంద్,రవి ప్రసాద్, నాగప్రతిష్ట,పార్వతి,రఘునందన్ తదితర టీచర్లు పాల్గొన్నారు.

Share this post...