
శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి భక్తుల గోత్రనామములతో విశేష అభిషేకాలు జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తి నామస్మరణలతో మార్మోగిందనీ..భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కొత్తగూడెం గణేష్ టెంపుల్ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.
