Wed. Jan 28th, 2026

ఆళ్లపల్లి:ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించి, కొత్త పిఆర్సిని ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథీరామ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.జడ్పీహెచ్ఎస్ మర్కోడు పాఠశాలలో సంఘం మండల అధ్యక్షులు అగ్గి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాథీరామ్ పాల్గొని మాట్లాడుతూ.. పాఠశాలలకు తనిఖీ బృందాల పేరుతో ఉపాధ్యాయులను డిప్టేషన్ పై తీసుకోవడం వల్ల ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్న సందర్భంలో, ఉపాధ్యాయులను తనిఖీ బాధ్యతల కోసం తీసుకోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.కాంప్లెక్స్ స్థాయి నుండి సిఆర్పీలు, ఎంఈఓలు, డీఈవోలు ఖాళీలను భర్తీ చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు.పాఠశాలల్లో ఆన్‌లైన్ విధానాల పేరుతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగి, బోధనా సమయం వృథా అవుతోందని ఆయన విమర్శించారు.ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు, పండిట్ మరియు పి ఈ టి ల అప్గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, సిఆర్టిల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.2008 డీఎస్సీకి చెందిన ఉపాధ్యాయుల జీతాలను కూడా తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మండల బాధ్యులు డి.నాగేశ్వరరావు, జి.వీరన్న బాబు,ఈ.సమ్మక్క,శారదామ్మ,వేణు, ప్రేమ్ కుమార్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...