Sat. Jan 31st, 2026

   సేవాలాల్ సేన లక్ష్మీదేవి పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ..భారీ వర్షాల ప్రభావంతో, కేంద్ర/సీసీఐ హఠాత్తుగా తేమ పెరుగుదల నిబంధన, ఎకరాకు క్వింటాళ్ల పరిమితి వంటి కఠినమైన ఆంక్షలతో పత్తి రైతుల కు పెట్టడం వల్ల చిన్న & సన్నకారు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యంగా వ్యవహరిస్తుండటం వల్ల రైతులకు కనీస మద్దతు ధర కూడా గట్టిగా లభించడంలేదు. డిజిటల్ యాప్ సమస్యలు, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ వంటి అడ్డంకులు నిర్మూలించాలి. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పూర్తి మార్కెట్ మద్దతుతో కొనుగోలు చేయాలనీ మా డిమాండ్- తేమ శాతం 20% వరకు ఉన్న పత్తిని సైతం తక్షణమే MSP ధర మీద కొనుగోలు చేయాలి.రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని ఎకరాకు ఏ విధంగా పరిమితం చేయకుండా ప్రభుత్వ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి.- ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 తరహా నిబంధనలు, కిసాన్ యాప్ లో సాంకేతిక సమస్యలు తొలగించాలి.జరగిన వర్షాభావం, తుపానుకు చెందిన నష్టానికి తక్షణం పరిహారం అధికారికంగా చెల్లించాలి- కొనుగోలు కేంద్రాలు మరింత పెంచి, నగదు చెల్లింపును 24 గంటల్లోగా తనిఖీ చేసి రైతు ఖాతాలో వేగంగా జమ చేయాలి.CCI మరియు ప్రైవేట్ వ్యాపారుల తీరును నియంత్రించాలి.రైతుల ధర్నాలకు సంబంధించిన అంశాలలో ముఖ్యమంత్రిగా సత్వర నిర్ణయాలు తీసుకోవాలి.పత్తి రైతు సంక్షేమమే రైతు సంక్షేమం!రైతుల డిమాండ్లకు బహిరంగ ఆందోళనలకు దిగాల్సి ఉంటుందనీ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, బానోతు లక్ష్మణ్ నాయక్ ,రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Share this post...