ఖమ్మం: నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందేమాతరం @150 సంవత్సరాలు కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా వ్యాసరచన, ఫ్యాన్సీ డ్రెస్,సాంస్కృతిక నృత్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా,ఖమ్మం పరిధిలోని అనేక పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని వ్యాసరచన మరియు సాంస్కృతిక నృత్యం విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులను గెలుచుకున్నారు.శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విధ్య, డిజిఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ రావూరి నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందిస్తూ,భవిష్యత్తులో కూడా ఇదే ప్రతిభను కొనసాగించాలని సూచించారు.
