నిజాన్ని నిర్భయంగా ప్రతిబింబించే అద్దమూ,సత్యాన్వేషణకు అక్షరాయుధమూ అయిన పత్రికలు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొంటూ, ప్రజా క్షేమం,సమాజ హితం, దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ (మన్కీ బాత్) కె.ఎన్. రాజశేఖర్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం గణేష్ చమన ఆవరణలో ప్రతిరోజూ ఒక మొక్క నాటే సేవ కార్యక్రమంలో భాగంగా 1966వ రోజు సందర్భంగా ‘నూరు వరాల పూల మొక్క’ నాటి ఆయన, జర్నలిస్టు మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
