నూతన జాక్ ఏర్పాటు,జాక్ చైర్మన్ గా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ నియామకం
J365NEWS,కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కేంద్రం CER క్లబ్ లో న్యాయవాది లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన లంబాడి గిరిజన సంఘాల జేఏసీ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ చైర్మన్ గా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ను లంబాడి సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ GO No.3 సాధన కోసం, విద్యా ఉద్యోగ రాజకీయ జిల్లా గిరిజన జనాభా ప్రతిపాదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించలి గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలనీ, జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణం, సేవాలాల్ మందిర నిర్మాణానికి మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించాలి, గిరిజన చట్టాలైన పెసా,1/70,2006 అటవీ హక్కు చట్టం పగడ్బందీగా అమలు,భద్రాచలం ఆలయ కమిటీ చైర్మన్, గిరిజనులకు కేటాయించాల పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయం చైర్మన్ స్థానిక గిరిజనులకు కేటాయించాలనీ జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ZPTC జడ్పీ చైర్మన్ గిరిజంతోనే భర్తీ చేయాలని సిద్ధాంతంతో గిరిజన లంబాడి సంఘాల జాయింట్ ఆక్షన్ కమిటీ పని చేస్తుందని పిలుపునిచ్చారు జేఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు గిరిజన సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు న్యాయవాది LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్,TTSF జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు డి.సురేష్ నాయక్, భారతీయ గోర్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు, దుర్గా ప్రసాద్, బోడ లాలు నాయక్, భట్టు జుంకీలాల్,GVS జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, ల. వెంకటేశ్వర్లు, లావూరి శ్రీనివాస్ భద్రంగి నాయక్, మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి రాథోడ్, LHPS జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్, న్యాయవాది L.రమేష్, పూర్ణ చందర్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శీను నాయక్ ,శీను నాయక్, సేవలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్, L.వెంకటేష్,బి. నాగరాజు నాయక్, మహిళా నాయకురాలు నందిని బాయి, గోర్ సీక్ వాడి నాయకులు బొజ్జ నాయక్, రామారావు నాయక్, వినోద్ నాయక్ ,శంకర్ నాయక్, శ్రీను నాయక్, వీరన్న నాయక్ , సేవ్య నాయక్, రవి భాస్కర్ తదితరు నాయకులు పాల్గొన్నారు.

