హైదరాబాద్‌లోని డిల్లీ పబ్లిక్ పాఠశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విలునేత్రం (ఆర్చరీ) పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో కె.రామ్ చరణ్ స్వర్ణ పతకంతో మెరిశాడు.అదే విభాగంలో బాలికల తరఫున పోటీపడ్డ ఇ.అవంతిక కాంస్య పతకాన్ని దక్కించుకుంది.రికర్వ్ రౌండ్ బాలికల విభాగంలో కె.లోహితశ్రీ అద్భుత నైపుణ్యంతో వెండి పతకం సాధించింది.ఈ విజయాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా విలునేత్రం సంఘం అధ్యక్షులు సాదుల సారంగపాణి, జనరల్ సెక్రెటరీ పుట్ట శంకరయ్య,జిల్లా యువక్రీడాల అధికారి టి. సునీల్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు.భవిష్యత్తులో దేశస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒలింపిక్ సంఘం కూడా విజేతలను ఆదరిస్తూ,జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసారు
