Tue. May 5th, 2026

అన్నపురెడ్డిపల్లి:పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిత్యం మొక్కలు నాటుతూ పలువురు ప్రముఖులకు మొక్కలను బహుమతిగా అందిస్తున్న ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ సోమవారం నాడు అన్నపురెడ్డిపల్లి మండలం జిపిఎస్ వెంకటాపురం పాఠశాల నందు పాఠశాల విద్యార్థులతో కలిసి కొన్ని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా శుభకార్యం కానీ, పుట్టినరోజున,పెళ్లిరోజున ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు.అనంతరం ఆకులతో గణితంలోని ఆకారాలు, ఆంగ్లంలోని అక్షరాలు, అంకెలతో బొమ్మలను విద్యార్థులతో చేయించి వాటిని వివరించారు.ఈ మేరకు పాఠశాలకు మొక్కలు వితరణ చేసినందుకు గాను హెచ్ఎం బి.కుమార్ మరియు సాహ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చరవాణి ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

Share this post...