సీతంపేట గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీసీ రోడ్ల పనులను 30 రోజుల్లో పూర్తిచేసి కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్, ఏఈ శ్రీనివాస్‌లకు ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఇంటి ముందుకు రహదారి సౌకర్యం అందేలా కృషి చేస్తామని తెలిపారు.సీతంపేట గ్రామానికి సీసీ రోడ్ల మంజూరు సాధ్యమైనందుకు పినపాక మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
