Tue. May 5th, 2026

       భద్రాద్రి కొత్తగూడెం: నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రకాశం స్టేడియంలో జిల్లా స్థాయి సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు.30, 35, 40, 45, 60, 65, 70, 75, 80 సంవత్సరాల విభాగాల్లో పురుషులు,మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 70 మంది మాస్టర్స్ అథ్లెట్లు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన అథ్లెట్లు డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్‌లో జరగబోయే నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌ షిప్‌ లో జిల్లా తరఫున పాల్గొననున్నారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంజిలాల్, ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహిదర్,కబడ్డి అసోసియేషన్ కార్యదర్శి స్వాతిముత్యం, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరేష్, ప్రో కబడ్డి ప్లేయర్ ప్రసాద్ పాల్గొన్నారు

Share this post...