భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల శాఖ మహాసభ మండల అధ్యక్షులు ఏ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. మహాసభలో ముందుగా పతాకావిష్కరణలు జరిగాయి.ఎస్ టి ఎఫ్ఐ పతాకాన్ని రిటైర్డ్ సీనియర్ నాయకులు డీ జోగయ్య, టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని ఆర్ సురేష్ బాబు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ముఖ్యఅతిథిగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల ను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును ఉద్దేశించి మాత్రమే ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఐదు సంవత్సరాలు సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు అందరూ తాము సర్వీస్ లో కొనసాగాలంటే మరియు ప్రమోషన్ పొందాలంటే ఉపాధ్యాయులు తప్పక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలని నిబంధన విధించడం సరి కాదని తెలిపారు. వెంటనే విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ డి ఏ లను వెంటనే విడుదల చేయాలని,పిఆర్సి నివేదిక తెప్పించుకొని మెరుగైన పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు గత రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే చెల్లించాలని, ఫైరవి డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ మండల మహాసభలో సంవత్సర కాలంగా జరిగిన కార్యకలాపాల నివేదికను ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ పాషా ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చించి ఆమోదించారు అనంతరం మండల శాఖకు సంబంధించి ఎన్నిక జరిగింది. ఎన్నికకు ఎన్నికల అధికారిగా జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు అబ్జర్వర్లుగా రాష్ట్ర కార్యదర్శి బి రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు వ్యవహరించారు. మండల నూతన కమిటీ. మండల అధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి హరి సింగ్, ఉపాధ్యక్షులుగా ఏ విజయభాస్కర్, పి సత్య శ్రీ,కోశాధికారిగా ఎం రాజులు, కార్యదర్శులుగా బి అంబ్రికా జాదవ్,బి శ్రీనివాసరావు, ఎస్ యశోద, వి సోమ్లా, ఈ సమ్మయ్య, కే బాబురావు, ఈ వెంకటేశ్వర్లు, టీ బాలు, ఎస్ కోటేశ్వరరావు, ఈ జీవన్, ప్రేమ్ కుమార్, నాగేంద్ర ప్రసాద్ మండల ఆడిటర్ గా టి వెంకన్న, ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ గా వి టి ఆర్ మోహన్ రావు, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ గా కే సువర్చల, సభ్యులుగా హబీబున్నిస, అంజని, అస్మా, సుధారాణి, నాగమణి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ గా పి. రాంబాబు ఎన్నికైనారు.ఈ మహాసభలో నాగమణి, బి జానకి రాములు, డీ జోగయ్య, ఎం మల్లికార్జునరావు, వై గోవిందరావు, ఆర్ సురేష్ బాబు,బి.ఈరు, బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
