ఐక్య తల్లిదండ్రుల సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు కొందరు సభ్యులకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్ గుడ్డ సంచులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మారుతి రత్నాకర్ మాట్లాడుతూ..ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ కోసం కృషి చేయాలని,అడవులను,అడవి జంతువులను,జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.అలాగే స్వచ్ఛ భారత్ నినాదంతో.. ప్రతి కుటుంబం తడి చెత్త,పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ విభాగం జిల్లా అధ్యక్షులు వేణు,జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన చారి,తునికి పాటి సాయిరామ్ చారి,కిరణ్ చంద్, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.
