రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కూలీలైన్ మసీదు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు ముగించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించి, సామూహికంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సోదరభావం, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.కార్యక్రమంలో మోమిత్,జుబ్బు,అబ్బు, టాపిక్,మున్నా,షోయబ్, సైద్, యాసీన్ పాషా, సోను, అఖిల్, సమీర్,అలీమ్, సోహెబ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
