Sat. Mar 14th, 2026

       AISF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF నాయకులు వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9,300 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్నత చదువులు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభావితం అవుతున్నాయని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే బడ్జెట్‌లో 30% నిధులు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుండాల సుజన్, మాణిక్యాల వినయ్, గుగులోత్ వంశీ, సంజయ్, రాజ్ కమల్, మహేష్, ఉదయ్, ఉమా మహేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share this post...