Sat. Apr 11th, 2026

కొత్తగూడెం పీఆర్‌టీయూటీఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అణగారిన వర్గాలకు ఆత్మబంధువుగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే విద్య ద్వారా సమాజాన్ని మార్గనిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. మహిళల విద్యాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అదేవిధంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, పీఆర్సీ, డీఏలు, ఆరోగ్య కార్డుల విషయంలో త్వరలోనే పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూణేం నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి ప్రభాకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా మరియు మండల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this post...