కొత్తగూడెం 52వ డివిజన్‌లో పిల్లలకు వ్యాక్సినేషన్ మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కార్పొరేటర్ కళావతి ధనరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలింతలు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడిలోనే తీసుకోవడంతో పాటు ఇంటికి తీసుకెళ్లి వినియోగించాలని తెలిపారు. సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శశికళ, శివ కుమారి, ఏఎన్ఎం శారద, ఆశ వర్కర్ కవిత పాల్గొన్నారు.
