Mon. Apr 27th, 2026

      రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చిన్నారి ప్రకృతి ప్రేమికురాలు “ప్రకృతి బ్లెస్సి” ప్రకృతి పరిరక్షణలో చేస్తున్న సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి ప్రకృతి ప్రకాష్ స్ఫూర్తితో మూడేళ్ల వయసు నుంచే సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో చల్లడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.2017లో ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన పద్మశ్రీ వనజీవి రామయ్య, చిన్నారికి “ప్రకృతి బ్లెస్సి”గా, ఆమె తండ్రికి “ప్రకృతి ప్రకాష్”గా నామకరణం చేశారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కూడా చిన్నారిని అభినందించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మొక్కలు నాటి ఘన సన్మానం చేశారు.ఇప్పటివరకు లక్షలాది గింజలతో సీడ్ బాల్స్ తయారు చేసి, డ్రోన్ సహాయంతో అడవుల్లో చల్లుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సీడ్ బాల్స్ తయారీలో ముందంజలో ఉన్న చిన్నారిగా పేరు తెచ్చుకుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని వేలాది మంది చిన్నారులు ప్రకృతి సేవల వైపు ముందుకు వస్తున్నారని అప్పుడు వనజీవి రామయ్య పేర్కొన్నారు. ఇటీవల కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీకారం చుట్టిన ప్రకృతి హరిత దీక్షను స్వీకరించిన ఈ చిన్నారి, తన స్నేహితులు జెస్సికా, అమూల్య, హనీ, హరీష్‌లకు కూడా ఈ దీక్ష అందజేసింది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది.కార్యక్రమంలో ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకుడు, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ చే ప్రశంసలు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు కె.ఎన్. రాజశేఖర్ , గౌరవ అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య, చీఫ్ అడ్వైజర్ షేక్ దస్తగిరి, అడ్వైజర్లు లగడపాటి రమేష్ చంద్, గుండపనేని సతీష్ కుమార్, మొక్కల వెంకటయ్య, ప్రకృతి వైద్యులు సుగుణ రావు, యోగా కమలా రాణి, భోగ లక్ష్మి, ప్రకృతి ప్రేమికుడు ఇంగ్లీష్ బాలు, యంగ్ ఇండియన్ బాలు, శ్రీ రంగం సంపత్,దాట్ల వెంకటేశ్వర్లు, సాంబయ్య, ముస్తఫా పర్వీన్, చిన్నారికి అభినందనలు తెలిపారు, ప్రకృతి హరిత దీక్ష చిన్నారులు పారుల్, నైనిక రజువా, ఎం డి.అఫా న్ జైదీ, చీమల వైష్ణవి, ముచ్చ యశ్విన్,అనేజా లు, షేక్ రిసాన్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

Share this post...