Fri. May 22nd, 2026

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ పరిధిలోని మేదరబస్తిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజలకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో, డివిజన్ కార్పొరేటర్ బండి నరసింహారావు ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఏఈ కనకయ్యను సంఘటన స్థలానికి తీసుకెళ్లి సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా వేలాడుతున్న తీగలు ఉన్న ప్రాంతాలను అలాగే కొత్త విద్యుత్ స్తంభాలు అవసరమైన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూపించారు. సమస్యను పరిశీలించిన ఎలక్ట్రికల్ ఏఈ కనకయ్య వెంటనే స్పందించి, ఉన్నత అధికారులకు సమాచారం అందించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Share this post...