డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూటీజీ డిమాండ్ చేసింది.కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4 మెమోను పొరుగు రాష్ట్రంలో అమలు చేసి డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, తెలంగాణలోనూ అదే విధంగా అమలు చేయాలని కోరింది. ఈ విషయాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించింది.ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూటీజీ జిల్లా అధ్యక్షుడు బి. రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి వై. సంఘమేశ్వరరావు, జిల్లా సహాయ అధ్యక్షుడు కె. ప్రసాద్, పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
