సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్ మహా ధర్నా’ కార్యక్రమ గోడపత్రికను లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్ శిరీష, పీఆర్‌టీయూ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బి.రవి హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బి. రవి మాట్లాడుతూ, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు కోసం చేపట్టే పోరాటానికి పీఆర్‌టీయూ తెలంగాణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సహాయ అధ్యక్షుడు ప్రసాద్, ఐటీడీఏ ప్రతినిధి హీరాలాల్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
