Wed. Aug 19th, 2026

ప్రజాప్రభుత్వ “శక్తి” పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ జేఏసీ, కొత్తగూడెం జిల్లాలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసింది. కొత్తగూడెం లోకల్ జేఏసీ కార్యవర్గం.చైర్మన్: శ్రీ పి. మానయ్య, సీనియర్ లెక్చరర్ / మెకానికల్,కో-చైర్మన్ జి.వి.ఎల్. లక్ష్మణరావు, లెక్చరర్ ఎం.ఎన్.జీ,కో-చైర్మన్-2 సీహెచ్.కృష్ణారావు, పి.డి.కో-చైర్మన్-3: బి. కృష్ణ, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్,కన్వీనర్: డి. శ్రీనివాస్, సీనియర్ లెక్చరర్ ఎం.ఈ.కో-కన్వీనర్:ఎం.డి. ఫైజ్, లెక్చరర్ / సి.ఈ.సెక్రటరీ (పబ్లిక్ రిలేషన్స్): సిహెచ్.రవికుమార్, లెక్చరర్ / ఈ.సి.ఈ.సెక్రటరీ (మహిళా విభాగం): డా. పి.వనిత, సీనియర్ లెక్చరర్ / బయోరాజ్ సెక్రటరీ (ఆర్గనైజింగ్): డి. లింగయ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్,సెక్రటరీ (కమ్యూనికేషన్స్): శ్రీ బి. రాము, ల్యాబ్ అటెండర్ కోశాధికారి (ట్రెజరర్): డి.శేఖర్, సీనియర్ అసిస్టెంట్ జేఏసీ ఏర్పాటు సందర్భంగా యూనియన్ ఆఫీసులో విస్తృత సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ బి.కరుణ కుమార్, బోధనా,బోధనేతర,వర్క్‌షాప్ మరియు నాలుగో తరగతి సిబ్బంది పాల్గొని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.“శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు” అనే నినాదంతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ప్రత్యేకతను, సాంకేతిక విద్యా వ్యవస్థను పరిరక్షించేందుకు ఐక్యంగా కృషి చేయాలని జేఏసీ నిర్ణయించింది. పాలిటెక్నిక్‌లు గ్రామీణ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సభ్యులు తెలిపారు. పాలిటెక్నిక్‌లను ఇతర వ్యవస్థల్లో విలీనం చేయకుండా వాటి ప్రత్యేకతను కొనసాగించాలని, ఏ జేఏసీ కొందని, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. “పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగుతాం” అని ప్రిన్సిపాల్ మరియు జేఏసీ సభ్యులు తెలిపారు.

Share this post...