లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు లగడపాటి రమేష్ చంద్ జన్మదిన సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో రమేష్ ముందుండడం అభినందనీయమన్నారు.కరోనా సమయంలో సేవలందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం,మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సోషల్ మీడియా కన్వీనర్,సీనియర్ జర్నలిస్ట్ వీరు నాయక్, జిల్లా ప్రతినిధులు జుబ్బు రాజేష్,మొక్కల బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
