Tue. Sep 1st, 2026

                    పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కళాశాల నుంచి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి తిరిగి కళాశాల ప్రాంగణంలోకి పంపించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ విద్యాభ్యాసం, భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్ నెం.97లోని పాయింట్ 1(iv)ను వెంటనే మినహాయించి డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Share this post...