సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు టేకులపల్లి మండలం బోడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. హాథీరామ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ… సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని, రెండో పీఆర్‌సీతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ,దేవీలాల్,కిషోర్,శంకర్, చంద్రరావు,లక్ష్మణ్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,ఉమ,పోటమ్మ,జ్యోతి, భానుప్రియ పాల్గొన్నారు.
