కొత్తగూడెం వీకేసీఎం వద్ద సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఉద్యోగులకు అవినీతి నిర్మూలన,పారదర్శకత,నిజాయితీ,నిబంధనల పాటింపుపై అవగాహన కల్పించారు.విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అవినీతికి తావులేకుండా చూడాలని సూచించారు.సీఎంపీఎఫ్ పథకాలు,ఉద్యోగుల ప్రయోజనాలు,ప్రావిడెంట్ ఫండ్ సేవలపై వివరించారు.కార్యక్రమంలో రీజినల్ కమిషనర్లు వంశీధర్, కనకమ్మ, అసిస్టెంట్ కమిషనర్ చిరంజీవి,ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సులోచన, శ్రీనివాస్,వీకేసీఎం మేనేజర్ మురళి,ఏఐటీయూసీ ప్రతినిధి హీరాలాల్,ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమారస్వామి,సీఎంపీఎఫ్,సింగరేణి అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.
