రామవరం నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పి జి హెచ్ ఎం ఎం.ద్రౌపతి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది,విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఆమె నాయకత్వంలో గత మూడు సంవత్సరాలుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ పాఠశాల విజయ పరంపర కొనసాగుతోంది. ఈ అవార్డు రావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొంటూ, ద్రౌపతి మరింత ఉత్సాహంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా పాఠశాలలో ఎస్‌ఏ ఫిజిక్స్‌గా పనిచేస్తున్న మహంకాళి బాబురావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఆయన ఉపాధ్యాయ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
