మణుగూరు : మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ లో బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో గురువారం సంక్రాంతి ముందస్తు పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు ముగ్గులు వేసారు. అనంతరం కరస్పాండెంట్ రాంబాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయంగా స్కూల్‌లో టీచర్లు, విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారన్నారు. పాఠశాల ముందు రకరకాల రంగులతో ముగ్గులు వేశారు. అనంతరం భోగిమంటలు వేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

