Wed. Jan 28th, 2026

మణుగూరు :తెలుగు లోగిళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి ప్రతి ఏటా ముగ్గుల పోటీలు వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల అన్నారు. గురువారం కిన్నెర కళ్యాణ మండపంలో మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందమైన రంగ వల్లులు తీర్చి దిద్దిన మహీలలకు బహుమతులు దొసపాటి లక్ష్మి తో కలిసి అందజేశారు. అనిత మొదటి బహుమతి, సాయి దివ్య రెండోవ, మూడో బహుమతి యాక లక్ష్మి, నాల్గో బహుమతి వెంకట లక్ష్మి, ఐదొవ బహుమతి భవానీ లకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్, వనితా వైభవం మణుగూరు ప్రతినిధులు ప్రెసిడెంట్ కేశా ప్రసాద్, సెక్రెటరీ vn మిట్టపల్లి శ్యామ్, ట్రెజరర్ నాగరాజు, ప్రెసిడెంట్ బోగ్గవరపు అంజలీ, సెక్రటరీ తమ్మిశెట్టి వసుధ, ట్రెజరర్ పాలవాయి వసుంధర, జోన్ చైర్మన్ vn kcgf ch. శేషు బాబు, రీజియన్ చైర్మన్- 6 vn, silver kcgf కడవెండి విశ్వ నాథ గుప్తా, బండారు నరసింహరావు, రీజియన్ సెక్రెటరీ పద్మజ, ఆర్యవైశ్య సంఘం మహిళా మండల అధ్యక్షురాలు చిత్తలూరి ఉమ, మాధవి, నారాయణమ్మ, నాగరత్న మణి, స్వరాజం, ఇందుమతి, సముద్రాల కృష్ణమూర్తి, మురహరి తదితరులు పాల్గొన్నారు.

Share this post...