భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మద్దిశెట్టి సామేలు ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం సరోజనపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి సామేలు గత 23 ఏళ్లుగా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం మరియు భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ లో పదవుల్లో ఉంటు సామాజిక ప్రజా సేవ చేస్తూ 670 గ్రామాలు 2 లక్షల మంది కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై కొట్లాడుతూ, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తిసుకెళ్తు ఎంతో పేరు తెచ్చుకున్నారు మద్దిశెట్టి సామేలు
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఆర్ధిక, ప్లానింగ్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు ది.10.01.2024 నాడు హైదరాబద్ లో ఉన్న గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్ కే ఆఫ్సల్, ప్రచార కమిటీ ఛైర్మన్ మరియు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్,డీసీసీ అధ్యక్షులు మరియు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొదెం వీరయ్య టీవైజేఏసీ అధ్యక్షులు మద్దిశెట్టి అజయ్ బాబు అధ్వర్యంలో మద్దిశెట్టి సామేలు తో పాటుగా మహమ్మద్ ఫయాజ్, ఎండీ. రంజాన్, గుగులోత్ రమేష్ నాయక్, గుగులోత్ నాగేశ్వరావు నాయక్, పలగానీ శ్రీనివాసరావు, తదితరులు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.