Thu. Jan 29th, 2026

కొత్తగూడెం : స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – కొత్తగూడెంలో స్థానిక MG రోడ్డులోని గణేష్ టెంపుల్ వద్దనున్న, వివేకానంద విగ్రహానికి తెలంగాణ వినియోగ దారుల, సమాచార హక్కుల చైతన్య వేదిక మరియు కొత్తగూడెం లయన్స్ క్లబ్ అధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సంధర్భంగా వక్తలు ప్రసంగిస్తూ ” స్వామి వివేకానంద అసలు పేరు నరేందర్ నాథ్ దత్త అని – ఆయన కలకత్తా లో 1863 లో జన్మించడం జరిగిందని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతీ యేటా జాతీయ యువజన వుస్థావాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వామి వివేకానంద తన 30 వ యేటా నే అమెరికా లోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగిస్తూ భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేయడం జరిగింది అని అన్నారు. ” కెరటం నాకు ఆదర్శం – లేస్తూ పడుతున్నందుకు కాదు., పడినా మళ్ళీ మళ్ళీ లేస్తున్నందుకు ” అంటూ యువతను ఉత్తేజితులను చేయడం జరిగింది అని అన్నారు. స్వామీ వివేకానంద అంటే ఒక ఆధ్యాత్మిక మూర్తి అని , తాత్విక శక్తి అని , ఆయన చెప్పిన ప్రవచనాలు ఎప్పటికీ సజీవంగా నిలిచి పోతాయని అన్నారు. స్వామీ వివేకానంద తన 39 వ యేటా, చిరుప్రాయంలో చనిపోయాడని అంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార హక్కు చట్టం కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ జూలూరి రఘుమా చారి , శ్రీ నగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్, లయన్స్ క్లబ్ కొత్తగూడెం అద్యక్షులు షేక్ దస్తగిరి లతో పాటుగా చిట్టుమల్ల చంద్రశేఖర్, బొంకు పరమెష్, కోడూరి నాగేశ్వర్ రావు, సుందర్ లాల్ కోరి, ఎల్లయ్య, కూర శ్రీధర్, కొయ్యడ నగేష్, గుందపనేని సతీష్ , కాసార్ల గోవిందా చారి , బాలు దింగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...