కాకినాడ, జనవరి-24 (J365న్యూస్) స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, క్లస్టర్ ఇంచార్జ్ జీను మణిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ కష్టంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం యువత భవిత కోసం యువగళ్ళం పాదయాత్రతో చరిత్ర సృష్టించి తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చి, జగన్ రెడ్డి పై అలుపెరిగిన పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన లోకేష్ పుట్టినరోజు నాయకులు కార్యకర్తలు నడుమ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, నాండ్ల చిరంజీవి, రాయి సాయి, వైభోగులకొండ బాబు యాదవ్, డేగల సత్తిబాబు, నేదురి గణేష్, ఎండి కాజా, వెలిశెట్టి బుజ్జి, కింగం రామకృష్ణ, సాంబతుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్, మారిశెట్టి గంగ, నల్లమాటి ఆనంద్, బండారు నాని, చేలికాని హరిగోపాల్ కుప్పతారావు, కొత్త నాగ పండు, గేడ్డమూరి బాబ్జి, కొండ్రోతు సుబ్బారావు, వాకారెడ్డి, కేసు బోయిన చిన్ని, ఈశ్వరరావు, పుర్రె వీరబాబు, బ్రహ్మాజీ, దార్ల నానాజీ, తదితరులు పాల్గొన్నారు.

