–సామాజిక కార్యకర్త అస్త్రంగా ‘కోట’ పేచీలు
–అవగాహన లేని ఫిర్యాదులు అంతులేని స్టేట్మెంట్లు
–పనిచేసుకోకుండా బట్ట కాల్చిమీద వేస్తున్న వైనం
భద్రాద్రి కొత్తగూడెం 26 జనవరి( J365న్యూస్):ఇద్దరు అధికారుల మధ్య నాటి వైరం చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి. సామాజిక కార్యకర్త రూపంలో ‘కోటా’ అస్త్రాలుగా మారి కళాశాల పరువును రోడ్డుకీడుస్తున్నాయి. విద్యార్థులు స్వయంగా నిర్వహించే హాస్టళ్లను గతంలో ఎప్పుడు నోటిఫికేషన్ ద్వారా నియామకం జరగని తాత్కాలిక ఒప్పంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు వేయడం లేదు అని వింత వాదన . ఒక సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉంటే కళాశాల లెక్కల్లో అన్యాయాలు జరిగే అవకాశం ఉందంటూ భవిష్యత్ తలరాతలు అంచనా వేస్తూ మీరు పెట్టుకున్న తాత్కాలిక ఒప్పందం ఉద్యోగిని తొలగించి తాను చెప్పిన వారికి ఇచ్చి చేసిన తప్పుకు ప్రాయుశ్చిత్తం చేసుకోవాలని శివుని ఆజ్ఞ అంటూ శంకరుడు చేస్తున్న హుకుం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధికార ఉద్యోగుల మధ్య చిన్న తగాదాలు చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి. అత్యవసరమై నియమించుకున్న ఓ తాత్కాలిక ఒప్పందం కార్మికురాలిని తొలిగించి తనకు నచ్చిన వారిని పెట్టించి లబ్ధిపొందాలని మరొకరు. వచ్చిన కొద్దిపాటి ధరకాస్తులను పరిశీలించి నియమించిన వారిని తొలిగించి రోడ్డున పడేసి నీకు లబ్ధి చేకూర్చలా అని మరొకరు. తాత్కాలిక ఒప్పందం ఉద్యోగానికి అసలు నోటిఫికేషన్ ఎందుకేయలేదు. తాను చెప్పిన వారిని పెట్టుకోండి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు ఉంటే అన్యాయాలు అక్రమాలు జరిగే అవకాశం ఉందని మరొకరు ఇలా ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు పిర్యాదులు చేస్తూ తమ వ్యక్తిగత కక్షలను అత్తెసరు కార్మికురాలిపై రుద్దుతూ అనవసరపు రాద్దాంతం సృష్టిస్తూ చిటీకి మాటికి ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్త పేరిట ఫిర్యాదులు చేస్తూ కళశాల పరువును రోడ్డుకీడుస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి అని చెబుతూనే తాను చెప్పే వారే అసలైన నిరుద్యోగులు మిగతా వారు డిగ్రీ పట్టా ఉన్న ‘మామూలే’ లేకుంటే అధికారులకు ఫిర్యాదులు అందుతాయి. తనకున్న రాష్ట్ర కార్యదర్శి పదవితో ఎక్కడికైనా ఫిర్యాదు పెట్టగలను అంటూ బెదిరింపులకు ఒడిగడుతున్నాడు ఓ సామాజిక కార్యకర్త. దీంతో నోటిఫికేషన్లు ఇవ్వని ఉద్యోగాలకు వచ్చిన అల్తెసరు జితగాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇద్దరి అధికారుల మధ్య ఉన్న వివాదాలను సామాజిక కార్యకర్త ద్వారా రొడ్డుకీడుస్తున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
