Tue. Feb 3rd, 2026

J365న్యూస్:కాకినాడ రూరల్ ఎంపిడిఓ గా రమేష్ నాయుడు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ కొంగు సందీప్ రాజ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతో ఎంపిడిఓ రమేష్ నాయుడు ని మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఎంపీడీఓ గా విధులు నిర్వహిస్తూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, కాకినాడ రూరల్ మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో సమన్వయంతో నడిపిస్తానని నాణ్యమైన సేవలను ప్రజలకు అందిస్తూ, ఎంపీడీఓ సిబ్బందిని, ప్రజా ప్రతినిధుల ను అందరినీ కలుపుకొని నాణ్యమైన సేవలు అందించే విధంగా ప్రయత్నిస్తానని ఎంపిడిఓ రమేష్ నాయుడు అన్నారు. ముఖ్యంగా మా సిబ్బంది సీనియర్లు వారందరి సలహా సూచనలతో ప్రజా ప్రతినిధులు అందర్నీ కలుపుకొని తప్పనిసరిగా మంచి సేవల్ని అందించగలుగుతానని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో మీ అందరి యొక్క సహకారంతో ఎన్నికలు సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా ఆశిస్తూ కచ్చితంగా నిజాయితీగా, పారిషత్తుగా ఎన్నికల జరిపించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నానని ఎంపిడిఓ రమేష్ నాయుడు సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులకు తెలియజేశారు. అనంతరం పలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, బీసీఎన్ న్యూస్ క్యాలెండర్, సూర్య వెలుగు క్యాలెండర్, వార్తాబలం క్యాలెండర్, ఎంపీడీఓ రమేష్ నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ కొంగు సందీప్ రాజ్, సెక్రటరీ కొంగు జాక్విలిన్, ట్రెజరర్ పేరి రామకృష్ణ శర్మ, యూనియన్ కోఆర్డినేటర్ రోకళ్ళ సత్యరాజు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మట్టపర్తి శ్రీధర్ సిద్దు,జట్ల గోవింద్,యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Share this post...